News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 9, 2026

లెబనాన్‌పై ఇజ్రాయెల్ సీక్రెట్ కెమికల్ వెపన్?

image

లెబనాన్‌పై ఇజ్రాయెల్ ‘వైట్ ఫాస్పరస్’ ప్రయోగించిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ ఆరోపించింది. మార్చి 3న యోహ్మోర్ పట్టణంలోని నివాస ప్రాంతాలపై సీక్రెట్‌గా ఈ కెమికల్ వెపన్స్‌ను వాడినట్లు వెల్లడించింది. గాలిలోని ఆక్సిజన్‌తో కలిసినప్పుడు మండే గుణం ఉన్న ఈ పదార్థంతో ఇళ్లు, కార్లు తగలబడ్డాయని, ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని పేర్కొంది. దీనివల్ల పౌరులకు ప్రాణాపాయం లేదా తీవ్రమైన గాయాలు అయ్యే ఛాన్స్ ఉంటుంది.

News March 9, 2026

ఇతిహాసాల నుంచి నానుడిలు: ‘ముసలం పుట్టడం’ అంటే ఏమిటి?

image

ఒక సమాజం, కుటుంబం, లేదా పార్టీ అంతర్గత కలహాలతో నాశనమైపోతుంది అని చెప్పడానికి ‘ముసలం పుట్టింది’ అనే నానుడిని వాడతారు. ఇది మహాభారతంలోని ‘మౌసల పర్వం’ నుంచి వచ్చింది. యాదవులు అపహాస్యం చేయడంతో వారి వంశ నాశనానికి ముసలం(ఇనుప రోకలి) పుడుతుందని మునులు శపిస్తారు. అన్నట్లుగానే యాదవ వంశం పతనమై ద్వారక సముద్రంలో కలిసిందని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 9, 2026

భక్తులకు మెరుగైన సదుపాయాలు: మంత్రి అడ్లూరి

image

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ధర్మపురి క్షేత్రంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ బి.సత్యప్రసాద్ ధర్మపురిలో సమీక్ష నిర్వహించారు. ధర్మపురి గోదావరి తీరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉండడంతో పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ చేయాలని అధికారులకు తెలిపారు.