News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 13, 2026

ఎక్కువ రేట్లకు సిలిండర్లు అమ్ముతున్నారా.. కాల్ చేయండి.!

image

గ్యాస్ సిలిండర్లపై అసత్య వార్తలు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. సిలిండర్ల కొరత, ధరలు పెరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే 112 సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని విశ్వసించాలన్నారు.

News March 13, 2026

MNCL: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

image

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దేవాపూర్ ఎస్సై గంగారాం కథనం ప్రకారం.. కాసిపేట మండలం లంబాడితండా(డి)కు చెందిన హరీశ్(28) డిప్లొమా పూర్తి చేసి, ఇంజినీరింగ్ మధ్యలో ఆపేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేశాడు. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడినా ఫలితం దక్కలేదు. ప్రైవేట్ కొలువు చేయలేక, ఒత్తిడికి లోనైన యువకుడు సూసైడ్ నోటు రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు.

News March 13, 2026

భద్రాచలం: శ్రీరామ నవమి.. 400కు పైగా SPL. బస్సులు

image

భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలకు TGSRTC, APSRTCలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఖమ్మం రీజియన్ నుంచి 234, ఏపీ నుంచి 172 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం సరిరామ్ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా విజయవాడ, హైదరాబాద్‌లకు అదనపు సర్వీసులను కేటాయించారు. భద్రాచలం జూనియర్ కళాశాల నుంచి ఆలయం వరకు భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు.