News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 22, 2026
జమ్మలమడుగు యువకుడికి ఆల్ ఇండియా ర్యాంక్

జమ్మలమడుగు (M) ఎస్. ఉప్పలపాడు గ్రామానికి చెందిన తలారి మోహన్ గేట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో మెకానికల్ ఇంజినీరింగ్ (ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్) విభాగంలో ఆల్ ఇండియా 89వ ర్యాంక్ సాధించి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మోహన్ తల్లిదండ్రులు సంజీవరాయుడు, లక్ష్మీదేవి, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.
News March 22, 2026
పనులు వేగవంతం చేయాలి: Dy.CM భట్టి

బోనకల్ మండలం లక్ష్మీపురంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని స్పష్టం చేశారు. విద్యపై ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఈ పాఠశాలలు భవిష్యత్ తరాల నిర్మాణానికి దార్శనిక కేంద్రాలవుతాయని పేర్కొన్నారు.
News March 22, 2026
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. 15minలో మెసేజ్ డిలీట్!

వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ రానుంది. దీనిని యూజర్లు ఎనేబుల్ చేసుకుంటే చాట్ లోని మెసేజ్‌లు వాటికవే డిలీట్ అవుతాయి. మెసేజ్ ఓపెన్ చేసిన టైమ్ నుంచి 15min కౌంట్ డౌన్ మొదలవుతుంది. అది పూర్తవగానే సెండర్, రిసీవర్ చాట్‌లో మెసేజ్ మాయమవుతుంది. ఓపెన్ చేయని మెసేజ్‌లు 24hrs వరకూ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉంది. OTP, పాస్‌వర్డ్స్ వంటి వివరాలు షేర్ చేసే వారికి ఇది ఉపయోగపడొచ్చు.


