News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 17, 2026

నల్గొండ వాసికి అంతర్జాతీయ గౌరవం

image

నల్గొండకి చెందిన సైబర్ భద్రత నిపుణుడు వెంకట్ రమణరావు అదోనికి అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న అకడమిక్ కౌన్సిల్ ఆన్ యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ నిర్వహించే 39వ వార్షిక సమావేశంలో పాల్గొనాలని ఆయనకు ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో తన పరిశోధనా పత్రాన్ని ప్రదర్శించనున్నారు. సమావేశం జూలై 1 నుంచి 3 వరకు పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో జరగనుంది.

News March 17, 2026

WGL: రంజాన్ తోఫాలు 10,250!

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ‘ఈద్ కా తోఫా’ పంపిణీ చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,250 కిట్లను పంపిణీ చేయనున్నారు. వరంగల్‌కు 3 వేలు, హనుమకొండ 2,500, జనగామ 2 వేలు, మహబూబాబాద్‌ 1,250, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు 750 చొప్పున కిట్లు కేటాయించారు. స్థానిక మసీదు కమిటీల ఆధ్వర్యంలో వీటిని అందజేయనున్నారు.

News March 17, 2026

ఏలూరు: స్నాక్స్ కొనిస్తానని తీసుకెళ్లి బాలికపై అత్యాచారం

image

ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో రెండో తరగతి చదివే బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికకు స్నాక్స్ కొనిపిస్తానని రాముడు (55) మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.