News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 18, 2026
GNT: టెన్త్ విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

వట్టిచెరుకూరు బీసీ హాస్టల్‌కు చెందిన టెన్త్ విద్యార్థి రాకేశ్ ఆత్మహత్య ఘటనపై మంత్రి సవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి కుటుంబానికి ఆమె సానుభూతి తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఒత్తిడికి గురికాకుండా చూడాలని హాస్టల్ యాజమాన్యానికి సూచించారు. మార్కులే జీవితంలో ముఖ్యం కాదని చెప్పారు.
News March 18, 2026
రేపే ఉగాది.. ఇలా చేస్తే మంచిది!

తెలుగు క్యాలెండర్ ప్రకారం ‘శ్రీ పరాభవ నామ’ సంవత్సరం రేపు ప్రారంభంకానుంది. ఇది గతాన్ని విశ్లేషించుకొని కొత్త విజయాల వైపు సాగాలని సూచిస్తుంది. సూర్యోదయానికి ముందే స్నానాలు ఆచరించి, ఇళ్లను మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. పంచాంగ శ్రవణం వినడం వల్ల నూతన సంవత్సర రాశిఫలాలు, గ్రహాల ప్రభావం తెలుస్తుంది. గుమ్మాలకు పసుపు, కుంకుమ రాసి ముగ్గులు వేయాలి. ఇష్ట దైవానికి పూజ చేసి దానం చేయడం శుభప్రదం. SHARE IT
News March 18, 2026
మేడేపల్లి: పిడుగుపాటుకు యువకుడు బలి

ఆత్మకూరు మండలం మేడేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం సమయంలో మిర్చి చేను వద్దకు వెళ్లిన గొల్ల రాములు (25) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని సర్పంచ్ రాయుడు తెలిపారు. యువకుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


