News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 27, 2026

ఒట్రోవర్ట్స్ గురించి తెలుసా?

image

మనుషుల్లో ఇన్‌ట్రోవర్ట్స్, ఎక్స్‌ట్రోవర్ట్సే కాకుండా ఒట్రోవర్ట్స్ కూడా ఉంటారని US సైకియాట్రిస్ట్ రమీ కమిన్స్కీ చెబుతున్నారు. ‘అందరితో కలిసిపోయినట్లు కనిపిస్తారు. గ్రూపుల్లో యాక్టివ్‌గా, మిగతావారితో కలివిడిగా ఉంటారు. కానీ లోపల మాత్రం వారి అనుభవం వేరుగా ఉంటుంది. తమ నిజమైన స్వభావానికి ప్రాధాన్యం ఇస్తారు. భావోద్వేగాల పరంగా స్వతంత్రంగా ఉంటారు’ అని కమిన్స్కీ వివరించారు. మరి మీరూ ఒట్రోవర్టా?

News March 27, 2026

విజయవాడలో తలసేమియా సెంటర్ ప్రారంభిస్తాం: నారా భువనేశ్వరి

image

త్వరలోనే విజయవాడలో తలసేమియా సెంటర్ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం కుప్పం (చిత్తూరు)లో పర్యటించిన ఆమె దీనిపై ప్రకటన విడుదల చేశారు. విజయవాడతో పాటు అనంతపురంలో ప్రారంభించే తలసేమియా సెంటర్ నిర్వహణ బాధ్యతను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చూసుకుంటుందన్నారు. విజయవాడలో తలసేమియా సెంటర్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమైందన్నారు.

News March 27, 2026

VJA: ఉగ్రవాద కేసులో కీలక మలుపు!

image

ఉగ్రవాద కార్యకలాపాల కేసు దర్యాప్తులో కొత్తపేట పోలీసులు కీలక పురోగతి సాధించారు. శుక్రవారం మరో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు CI కొండలరావు తెలిపారు. పట్టుబడిన వారిలో లక్కీ అహ్మద్, అజ్ముల్లా ఖాన్, అబ్దుల్ మజీద్, ఆసిఫ్ అలీ, షారుక్ ఖాన్, రెహమాన్ ఉన్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకోగా అరెస్టులతో ఈ కేసు దర్యాప్తు వేగవంతమైంది. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.