News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 13, 2026

గన్నవరం: మంచుతో విమాన రాకపోకలకు అంతరాయం

image

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోవడంతో విమానాల రాకపోకలు అంతరాయం కలిగాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నుంచి రావాల్సిన విమానాలు కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. పరిస్థితి మెరుగుపడిన తర్వాతే విమానాల ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడం జరిగిందని అధికార వర్గాలు వెల్లడించారు.

News March 13, 2026

ఇళ్ల నిర్మాణాల్లో చిత్తూరు జిల్లాకు తొలి స్థానం

image

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు. పీఎంఏవై పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉంది. 74,199 ఇళ్లకుగానూ 64,928 నిర్మాణాలను పూర్తి చేసి 88 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఉగాది నాటికి 8,855 ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యం చేసుకోగా.. ఇప్పటికే 8,481 ఇళ్లు పూర్తయ్యాయి.

News March 13, 2026

నేడే పీఎం కిసాన్ నిధులు విడుదల

image

పీఎం కిసాన్ 22వ విడత నిధులను కేంద్రం ఇవాళ విడుదల చేయనుంది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులను రిలీజ్ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా అర్హులైన 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో.. రూ.18,640 కోట్లను జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2019 నుంచి కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలను వ్యవసాయ పెట్టుబడి సాయం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.