News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 15, 2026
మరణం కాదు.. నరకం నుంచి విముక్తి!

<<19352489>>హరీశ్ రాణా<<>> కేసులో ‘పాసివ్ యుథనేషియా’కు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఇది నేరుగా ప్రాణం తీసే ప్రక్రియ కాదు. కోలుకునే అవకాశం లేని రోగికి కృత్రిమంగా అందిస్తున్న వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్ వంటి లైఫ్ సపోర్ట్‌ను నిలిపేస్తారు. దీనివల్ల బాధితుడు తన అనారోగ్యం కారణంగా సహజంగా మరణిస్తారు. వాళ్లు పడే నరకయాతనను ముగించి గౌరవప్రదమైన మరణాన్ని అందించడమే ఈ వైద్య ప్రక్రియ ఉద్దేశం.
News March 15, 2026
కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా డిస్కౌంట్లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ వివరాలు లేదా OTPలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు.
News March 15, 2026
నంద్యాల కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్‌లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి గురించి తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లోనూ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చన్నారు.


