News April 29, 2025

భద్రకాళి ఆలయంలో కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవగాహన

image

కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు మట్టెవాడ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరానికి గురైన బాధితులు ఎవరిని సంప్రదించాలి, 1930 నంబర్‌కు ఎలా ఫిర్యాదు చేయాలి, మత్తు పదార్థాల వినియోగం, విక్రయం ద్వారా కలిగే నష్టాలను ఎస్ఐ పోచాలు స్థానిక భద్రకాళి దేవాలయంలోని భక్తులకు వివరించారు.

Similar News

News April 4, 2026

లింగ నిర్ధారణ పరీక్షలను పూర్తిగా అరికట్టాలి: కలెక్టర్

image

లింగ నిర్ధారణ పరీక్షలను పూర్తిగా అరికట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, బ్రూణ హత్యలు నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్కానింగ్ సెంటర్లు, ఔషధ దుకాణాలపై నిరంతర తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాల స్థాయిలో అవగాహన పెంపుతో మంచి ఫలితాలు సాధ్యమని సీనియర్ సివిల్ జడ్జి జి. వాణి పేర్కొన్నారు.

News April 4, 2026

పెద్దపల్లి: ‘ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి’

image

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించి, బూత్ స్థాయి అధికారుల ద్వారా మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఫారం-6,7,8దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. చర్యలు కొనసాగుతున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష చెప్పారు.

News April 4, 2026

దొంగతనం కేసులో న్యాయమూర్తి.. ముందస్తు బెయిల్ నిరాకరణ

image

నిందితులకు శిక్షలు విధించే న్యాయమూర్తే దొంగతనం కేసును ఎదుర్కొంటున్న ఘటన పంజాబ్‌లోని పటియాలాలో జరిగింది. గతేడాది అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి కన్వల్జిత్ సింగ్ చనిపోయారు. అదే రోజు రాత్రి ఆయన ఇంట్లో సివిల్ జడ్జి విక్రమ్‌దీప్ బంగారు ఆభరణాలను దొంగతనం చేసినట్లు కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను పటియాలా కోర్టు తిరస్కరించింది. వీడియో ఆధారాలున్నందున బెయిల్ ఇవ్వలేమంది.