News May 7, 2025
భద్రకాళి ఆలయంలో కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవగాహన

కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు మట్టెవాడ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరానికి గురైన బాధితులు ఎవరిని సంప్రదించాలి, 1930 నంబర్‌కు ఎలా ఫిర్యాదు చేయాలి, మత్తు పదార్థాల వినియోగం, విక్రయం ద్వారా కలిగే నష్టాలను ఎస్ఐ పోచాలు స్థానిక భద్రకాళి దేవాలయంలోని భక్తులకు వివరించారు.
Similar News
News March 14, 2026
నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్

తెలంగాణలో నేటి నుంచి ఏప్రిల్ 13 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. 9.30AM-12.30PM వరకు 3 గంటల పాటు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలని, ఎగ్జామ్ ప్రారంభమైన 5 ని. తర్వాత కూడా అంటే 9.35AM వరకు లోపలికి అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచులు, కాలిక్యులేటర్లకు పర్మిషన్ లేదు.
All The Best
News March 14, 2026
సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు: BJP

ప్రపంచంలో ఇంధన సంక్షోభం నెలకొన్నా భారత్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగలేదని బీజేపీ ట్వీట్ చేసింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో బ్యారెల్ ధర $100 దాటినా మోదీ ప్రభుత్వ ముందుచూపుతో దేశంలో రేట్లు పెరగలేదని తెలిపింది. ఇదే సమయంలో G20 దేశాల్లో 20% వరకు ఇంధన ధరలు పెరిగాయని వెల్లడించింది. దేశంలో 7-8 వారాలకు సరిపడా క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని, వివిధ దేశాల నుంచి ఆయిల్ దిగుమతి అవుతోందని వివరించింది.
News March 14, 2026
WGL: ఆస్తి పన్ను వసూళ్లు మందగింపు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జీడబ్ల్యూఎంసీతో పాటు 12 మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపునకు 18 రోజులు మాత్రమే ఉండగా, సగటున 50 శాతం మాత్రమే వసూళ్లయ్యాయి. గడువు లోగా పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక బృందాలతో ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే సిబ్బంది కొరతతో లక్ష్యం సాధ్యమవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


