News May 7, 2025

విరాట్ అనవసరంగా రిటైర్ అయ్యారు: రైనా

image

టీ20Iల నుంచి కోహ్లీ అనవసరంగా రిటైరయ్యారని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డారు. ‘కనీసం 2026 T20 వరల్డ్ కప్ వరకూ కోహ్లీ ఆడాల్సింది. IPLలో అతడి ఫిట్‌నెస్ స్థాయులు, ఆడే విధానం చూస్తుంటే తొందరపడ్డారనే అనిపిస్తోంది. ఆయనింకా తన అత్యుత్తమ దశలోనే ఉన్నారు. మరికొంత కాలం కొనసాగాల్సింది’ అని పేర్కొన్నారు. IPL-2025లో కోహ్లీ ఇప్పటి వరకు 392 రన్స్‌ చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నారు.

Similar News

News November 18, 2025

నీటి వాడుక లెక్కలు తేల్చేందుకు AP సహకరించడం లేదు: ఉత్తమ్

image

కృష్ణా జలాల వినియోగాన్ని తెలుసుకొనేలా టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు AP సహకరించడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘నీటిని ఏ రాష్ట్రం ఎంత వినియోగిస్తోందో తెలుసుకొనేందుకు 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటుచేశాం. మరో 20 ఏర్పాటుకావాలి. వీటి ఏర్పాటుకు ఏపీ ముందుకు రావడం లేదు. తన వాటా నిధులూ ఇవ్వడం లేదు. స్టేషన్ల ఏర్పాటుకు ఆ నిధులనూ మేమే ఇస్తామని కేంద్రానికి చెప్పా’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.

News November 18, 2025

బస్సుకు మంటలు.. 45 మందిని కాపాడిన కానిస్టేబుల్

image

AP: నెల్లూరు జిల్లా సంగం హైవేపై పెను ప్రమాదం తప్పింది. 45 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కింద మంటలు చెలరేగాయి. అదే రోడ్డుపై వెళ్తున్న సంగం కానిస్టేబుల్ నాగార్జున వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. బస్సును నిలిపివేసిన డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించేశాడు. దీంతో ఘోర ప్రమాదం తప్పిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. అప్రమత్తం చేసిన కానిస్టేబుల్‌ను అభినందించారు.

News November 18, 2025

సింహ ద్వారం వాస్తు ప్రకారం లేకపోతే?

image

మిగతా గృహ నిర్మాణం అంతా వాస్తు ప్రకారం ఉంటే సింహద్వారం ప్రభావం కొద్దిగా తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇతర విషయాలన్నీ అనుకూలంగా ఉంటూ సింహ ద్వారం వాస్తు ప్రకారం లేకపోయినా పెద్దగా దోషం ఉండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘వ్యక్తిగత పేరు, జన్మరాశి ఆధారంగా సింహద్వారం ప్రభావాన్ని తెలుసుకోవచ్చు. వాస్తుపరమైన ఇతర సానుకూలతలు ఈ లోపాన్ని అధిగమించడంలో సహాయపడతాయి’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>