News May 7, 2025
కామారెడ్డి: ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి: షబ్బీర్ అలీ

పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పహల్గామ్‌లో పర్యటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని ఖండిస్తున్నామని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Similar News
News March 6, 2026
ఇరాన్‌పై US దాడులు.. ఏఐతో సెకన్లలో ప్లానింగ్!

US మిలిటరీకి AI కొత్త అస్త్రంగా మారింది. ఇరాన్‌పై దాడులు స్టార్ట్ చేసినప్పుడు 12 గంటల్లో 900కుపైగా లక్ష్యాలపై అటాక్ ఏఐతోనే సాధ్యమైంది. మేవెన్ స్మార్ట్ సిస్టమ్ 150కిపైగా సోర్సుల నుంచి రహస్య డేటా సేకరించి సెకన్లలో టార్గెట్స్ సెట్ చేసింది. సాధారణంగా ఈ ప్రక్రియకు కొన్నిరోజులు పడుతుంది. అయితే పాత డేటాతో తప్పుడు లక్ష్యాలపై దాడి జరిగే ప్రమాదం ఉంది. స్కూల్‌పై <<19288920>>దాడి<<>> అలాగే అయి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి.
News March 6, 2026
NGKL: బాలికపై అత్యాచారయత్నం.. UPDATE

ఉప్పునుంతల(M) ఓ గ్రామంలో గిరిజన బాలికపై అత్యాచారయత్నం చేసిన ఇద్దరి యువకులపై కేసు నమోదు చేసినట్లు SI వెంకట్ రెడ్డి తెలిపారు. ఉత్సవాల నాటకం చూసి ఇంటికి వెళ్తున్న బాలికను బలవంతంగా ఓ దుకాణంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించారు. బాలిక వద్ద ఉన్న సెల్ లైట్‌తో వారి ముఖాలు గుర్తించింది. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 6, 2026
నాగర్‌కర్నూల్: ఫోక్సో కేసులో 20 ఏళ్లు జైలు

ఫోక్సో కేసులో ఓ నిందితుడికి నాగర్ కర్నూల్ కోర్టు 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. NGKLలోని శ్రీపురం రోడ్డు సంజయ్ నగర్ కాలనీకి చెందిన సుజిత్ కుమార్(గణేష్) (21)పై 2024లో క్రైమ్ నెంబర్ 294 ఫోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం జిల్లా స్పెషల్ జడ్జి నసీం సుల్తానా నిందితుడికి 20ఏళ్లు జైలు శిక్షతోపాటు రూ.20వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ సంగ్రామ్ జి పాటిల్ తెలిపారు.


