News March 29, 2024

నల్గొండలో గెలిచి చరిత్ర సృష్టిస్తా.. బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి

image

నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నల్గొండలో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. బీజేపీ కాంగ్రెస్‌కు ఎప్పుడూ బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. బీజేపీలో అందరినీ కలుపుకొని పోయి పనిచేస్తా తప్పకుండా జిల్లాలో బీజేపీ జెండా ఎగరేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

Similar News

News March 21, 2026

నల్గొండ జీజీహెచ్‌లో వేధింపుల కలకలం..!

image

నల్గొండ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రక్షణ కరువైంది. ఎక్స్‌రే విభాగంలో శిక్షణ పొందుతున్న ఓ పారామెడికల్ విద్యార్థినిపై అక్కడే అవుట్‌సోర్సింగ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు తెగబడుతున్నాడు. నిందితుడి వేధింపులు మితిమీరడంతో భరించలేకపోయిన బాధితురాలు శనివారం ‘డయల్ 100’కు ఫిర్యాదు చేసింది.

News March 21, 2026

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

image

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు 30 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో కఠోర దీక్షలు, ప్రార్థనలు చేశారని ఆయన పేర్కొన్నారు. అల్లా దయతో వారందరి జీవితాల్లో సంతోషం, వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ఆయన ఆకాంక్షించారు. ముస్లింల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.

News March 21, 2026

NLG: వరి కోతల వేళ.. వరుణుడి గోల

image

జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన వరి పంట కోత దశకు చేరుకుంది. ఆయకట్టు ప్రాంతంలో ఎటుచూసినా పచ్చని పొలాలు మరో వారం, పది రోజుల్లో జిల్లాలో కోతల సందడి మొదలుకానుంది. అయితే, గత కొద్ది రోజులుగా ఆకాశం మబ్బులు పడుతుండడంతో రైతన్నల్లో వరుణుడి భయం వెంటాడుతోంది. ఈ రబీ సీజన్‌లో సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు, వివిధ చెరువులు, బోర్ల కింద జిల్లావ్యాప్తంగా సుమారు 5.56 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.