News May 7, 2025
ఏడాదిలో మెట్రోకు రూ.625 కోట్ల నష్టం

L&T హైదరాబాద్ మెట్రో సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.625.91 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఇది గతేడాదితో పోలిస్తే ఎక్కువ అని తెలిపింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో నష్టం రూ.5.55 కోట్లు కాగా, మొత్తం నష్టం మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ.6598.21 కోట్లకు చేరింది. మరోవైపు ఆదాయాన్ని పెంచడంలో భాగంగా HYD మెట్రో సంస్థ పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది.
Similar News
News March 13, 2026
గద్వాల: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి – డీఈవో

పదో తరగతి విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి కె. విజయలక్ష్మి సూచించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఆమె విద్యార్థులకు ధైర్యం చెప్పారు. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు.
News March 13, 2026
రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించాలి: VZM SP

జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో రేపు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పోలీసు అధికారులను శుక్రవారం ఆదేశించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించి ఇరు వర్గాలతో చర్చలు జరిపి పరిష్కారం చేయాలని సూచించారు. ఇందుకోసం పోలీస్ స్టేషన్ల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని తెలిపారు.
News March 13, 2026
ఘనంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం: జేసీ

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ-PM కిసాన్ నిధులు విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో పెనుకొండ, అమరాపురం, బత్తలపల్లి, లేపాక్షి, బుక్కపట్నం, నల్లచెరువు కేంద్రాలలో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిందన్నారు. రైతులు ఈ నిధులను సాగు ఖర్చులకు వినియోగించుకోవాలని జేసీ తెలిపారు.


