News May 7, 2025

గుంటూరు: పదో తరగతి ఫలితాల్లో మెరుగుదల 

image

గుంటూరు జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో స్థిరమైన పురోగతి సాధిస్తోంది. కరోనా కాలమైన 2020, 2021ల్లో ప్రభుత్వం అందరినీ పాస్ చేసింది. 2022లో జిల్లాలో ఉత్తీర్ణత శాతం 68.20గా నమోదై రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. 2023లో అది 77.40కి పెరిగి 6వ స్థానంలో నిలువగా, 2024లో 88.14 శాతంతో 16వ స్థానానికి చేరింది. అయితే 2025లో మళ్లీ పరుగులు పెడుతూ 88.53 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. 

Similar News

News September 10, 2025

13న గుంటూరులో జాతీయ లోక్ అదాలత్

image

గుంటూరు జిల్లాలో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. వాహన ప్రమాద బీమా, చెక్ బౌన్స్, చిన్న క్రిమినల్, కుటుంబ వివాదాలు, సివిల్, బ్యాంక్, భూ వివాదం, విభజన వంటి కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వివినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News September 10, 2025

రేపు అండర్-14, 17 బాలబాలికల క్రీడా పోటీలు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలబాలికల క్రీడా పోటీలు నిర్వహిస్తామని కార్యదర్శి గోపి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో కురుష్, పెదకాకాని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఆర్చరీ, పల్నాడు జిల్లా నందిగామ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చెపక్ తక్ర విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పాల్గొనదలచిన క్రీడాకారులు సంబంధిత స్కూల్ నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు

News September 10, 2025

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో స్టాపులు పునరుద్ధరణ

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని దొనకొండ, పిడుగురాళ్ల, కురిచేడు రైల్వే స్టేషన్లలో గతంలో రద్దు చేసిన రైళ్ల నిలుపుదలలను మళ్లీ పునరుద్ధరించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సమయపట్టిక ప్రకారం అన్ని రైళ్లు ఆగనున్నాయని అధికారులు వెల్లడించారు.