News May 7, 2025

ఏలూరు: గ్రీస్ దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు

image

ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి జితేంద్రబాబు నిరుద్యోగులకు శుక్రవారం శుభవార్త తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రీస్ దేశంలో ఉద్యోగాలు ఉన్నాయన్నారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 30లోపు https://naipunyam.ap.gov.in/program-registationలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఐటీఐ ఎలక్ట్రిషన్, ప్లంబర్, హెల్పర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. 35- 50 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. 9988853335 వివరాలకు సంప్రదించండి.

Similar News

News March 13, 2026

LPG సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్

image

TG: రాష్ట్రంలో LPG సిలిండర్ల రవాణా సురక్షితంగా, సకాలంలో జరిగేలా చూసేందుకు అవసరమైన చోట పోలీసు ఎస్కార్ట్ కల్పించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. అవి చమురు సంస్థలతో సమన్వయం చేసుకోనున్నాయి. గోదాములు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద శాంతి భద్రతల పర్యవేక్షణకు అధికారులను నియమించారు. కృత్రిమ కొరతను అరికట్టి కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా చూడటమే ఈ చర్యల వెనక ఉద్దేశంగా కనిపిస్తోంది.

‘అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తా’

image

అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ఆలయం నేపథ్యం తెలుసుకొని తాను సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యానన్నారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేయర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.