News May 7, 2025

SSS: ‘మలేరియా నిర్మూలనకు సహకరించాలి’

image

మలేరియా నిర్మూలనకు అందరూ సహకరించాలని శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రోజా బేగం పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పుట్టపర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య శాఖ అధికారి మాట్లాడుతూ.. పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు.

Similar News

News March 5, 2026

గ్యాస్, ఆయిల్ కొరత లేదు: ప్రభుత్వ వర్గాలు

image

ఇంధన భద్రత విషయంలో ఇండియా కంఫర్టబుల్ పొజిషన్‌లోనే ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘అవసరమైనంత మేర నిల్వలున్నాయి. రోజూ స్టాక్ నింపుతున్నాం. LPG/LNG కొరత లేదు. ప్రపంచంలో ముడి చమురుకు షార్టేజ్ లేదు. క్రూడ్, గ్యాస్ కొనుగోలు కోసం ఉత్పత్తిదారులు, వ్యాపారులు, IEA, OPECతో చర్చిస్తున్నాం. గ్యాస్ సరఫరాకు ఆస్ట్రేలియా, కెనడా ముందుకొచ్చాయి. UAE, USతో ఒప్పందం చేసుకున్నాం’ అని వెల్లడించాయి.

News March 5, 2026

సంగారెడ్డి: ’99 రోజుల ప్రణాళిక పకడ్బందీగా అమలు’

image

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన ’99 రోజుల ఆరోగ్య ప్రణాళిక’ను పకడ్బందీగా అమలు చేస్తామని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు తెలిపారు. గురువారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్య ప్రొఫైల్‌ను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సిబ్బంది కృషి చేయాలన్నారు.

News March 5, 2026

వరంగల్: విద్యుత్ సమస్యల కోసం ప్రతి సోమవారం ప్రజావాణి: CMD

image

వినియోగదారులకు మరింత చేరువై వారి సమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు NPDCL CMD వరుణ్ రెడ్డి తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కరించడానికి అన్ని సర్కిల్, డివిజన్, సెక్షన్ ఆఫీస్‌లలో పెట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేరుగా వినియోగదారుల సమస్యలు తెలుసుకొని సమస్య తీవ్రతను బట్టి అప్పటికప్పుడే లేదా సమయం తీసుకొని పరిష్కరించడానికి దోహద పడుతుందన్నారు.