News May 7, 2025

నరసరావుపేట: బాధితులతో మర్యాదగా మెలగాలి: ఎస్పీ

image

పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను హేతుబద్ధంగా విశ్లేషించి తగ్గించాలని పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. మహిళలు, బాలికలు, చిన్నారుల ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయించినా కఠినంగా వ్యవహరించాలన్నారు. 

Similar News

News March 23, 2026

దృశ్యం-3 రిలీజ్ వాయిదా

image

మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న దృశ్యం-3 సినిమా విడుదల వాయిదా పడింది. తన పుట్టిన రోజైన మే 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మోహన్‌లాల్ ఇన్‌స్టాలో వెల్లడించారు. ఈ మూవీని ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం 1, 2 చిత్రాలు సూపర్ హిట్ కాగా, వాటికి కొనసాగింపుగా మూడో భాగం వస్తోంది.

News March 23, 2026

విశాఖ: యాక్సిడెంట్.. తల్లి కళ్ల ఎదుటే కుమార్తె మృతి

image

పాత గాజువాక జంక్షన్‌లో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. కొరమండల్ ప్రాంతానికి చెందిన తల్లి కూతుర్లు స్కూటీపై వెళుతుండగా లారీ ఢీకొనడంతో కుమార్తె మల్లపురెడ్డి స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో గాజువాక జంక్షన్‌లో కలకలం రేగింది. కళ్ల ఎదుట కూతురు చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లి పోయింది. ఈ ప్రమాదంలో తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 23, 2026

MNCL: పదో తరగతి పరీక్షకు 22 మంది గైర్హాజరు

image

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. సోమవారం జరిగిన తృతీయ భాషా పరీక్షకు మొత్తం 9,690 మంది విద్యార్థులకు గాను 9,668 మంది హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 9,683 మందికి 9,663 మంది హాజరు కాగా, గతంలో ఫెయిలైన ఏడుగురిలో ఐదుగురు పరీక్ష రాశారు. మొత్తం 22 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.