News May 7, 2025
సీమా పాకిస్థాన్ వెళ్లాలా..? లాయర్ ఏమన్నారంటే?

PAKతో ఉద్రిక్తతల నడుమ ఆ దేశస్థులంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. అయితే అక్రమంగా దేశంలోకి వచ్చి భారత పౌరుడిని పెళ్లి చేసుకున్న పాకిస్థానీ సీమా హైదర్ దేశం వీడే అవసరం లేదని ఆమె లాయర్ శివ సింగ్ వెల్లడించారు. గ్రేటర్ నోయిడా వాసి సచిన్‌ను ఆమె పెళ్లి చేసుకుందని, ఇటీవల కూతురుకు జన్మనిచ్చిందని తెలిపారు. ఆమె పౌరసత్వం భర్తతో ముడిపడి ఉందని, కేంద్రం ఆదేశాలు వర్తించవని పేర్కొన్నారు.
Similar News
News April 1, 2026
రెండుమూడు వారాల్లో యుద్ధం ఆపేస్తాం: ట్రంప్

ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు చేస్తున్న US వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రానున్న 2-3 వారాల్లో సైనిక చర్య ఆపనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ ఆపరేషన్‌ను ముగించడానికి టెహ్రాన్‌తో దౌత్య ఒప్పందం అక్కర్లేదన్నారు. ఈలోగా అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకొనే సామర్థ్యాన్ని ఆ దేశం కోల్పోతుందని చెప్పారు. ఇక ఇరాన్‌పై అప్డేట్ ఇవ్వడానికి ట్రంప్ బుధవారం 9pm(US కాలమానం)కు ప్రసంగిస్తారని వైట్‌హౌస్ తెలిపింది.
News April 1, 2026
కూపర్.. బ్యాటింగ్ సూపర్

PBKS బ్యాటర్ కూపర్ కన్నోలి నిన్న GTపై ఆడిన IPL అరంగేట్ర మ్యాచులోనే అదరగొట్టారు. మిగతా బ్యాటర్లు ఔట్ అవుతున్నా ఏకాగ్రత కోల్పోకుండా చెలరేగారు. 44 బంతుల్లోనే 5ఫోర్లు, 5సిక్సులతో 72* రన్స్ చేసి జట్టును గెలిపించారు. దీంతో డెబ్యూ మ్యాచులో POTM అవార్డు అందుకున్న ప్లేయర్ల లిస్టులో చేరారు. కూపర్ కంటే ముందు ఈ జాబితాలో 18మంది ఉన్నారు. ఇక PBKS 2011 నుంచి లీగ్‌లో ఆడిన అన్ని తొలి మ్యాచుల్లో గెలుస్తూ వస్తోంది.
News April 1, 2026
వారి రేషన్ కార్డులు రద్దు!

TGలో IT రిటర్న్స్ దాఖలు చేసేవారి రేషన్ కార్డు రద్దవుతుందనే ప్రచారం జోరందుకుంది. క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్న GPOలు కార్డుదారుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారు. చాలామంది ఆదాయంతో సంబంధం లేకుండా పర్సనల్, హోమ్ లోన్ల కోసం, ఏదైనా పరిహారం పొందడం, ఆస్తుల అమ్మకం వంటి విషయాల్లో ITR ఫైల్ చేస్తుంటారు. దీంతో తమ రేషన్ కార్డు రద్దవుతుందనే ఆందోళనలో ఉన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.


