News May 7, 2025

మంగళగిరి: స్వాతంత్య్రానికి ముందు ఉన్న స్కూల్‌కి ఏమవుతోంది.? 

image

భారతదేశానికి బ్రిటిషర్‌ల నుంచి స్వాతంత్య్రం రావడానికి ముందే 1944 మంగళగిరిలో చింతక్రింది కనకయ్య పేరుతో పాఠశాల ఏర్పాటు చేశారు. ఇది ఎయిడెడ్ స్కూల్ అయినప్పటికీ పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల పేర్లు ఒకప్పుడు ఇక్కడి నుంచే వినిపించేవి. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య, పాస్ పర్సంటేజ్ దారుణంగా పడిపోవడం ప్రజలలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ పాఠశాలను మళ్లీ ముందు వరుసలో నిలబెట్టాలని ప్రజల కోరిక.

Similar News

News March 19, 2026

గుంటూరులో 8 మంది అధికారులపై వేటు

image

GNT నగరపాలక సంస్థలో అక్రమ కట్టడాలకు సహకరించిన 8 మంది టౌన్ ప్లానింగ్ అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని ఉన్నతాధికారులు నిర్ధారించారు. శారద, వెంకటరావమ్మ, రిజ్వానా, మల్లికార్జున, సురేఖ, హరిజానాయక్, అశోక్ కుమార్, సత్యనారాయణలపై AP సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

News March 18, 2026

తుళ్లూరులో పిడుగు పడి వ్యక్తి మృతి

image

తుళ్లూరులోని మేరీమాత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో పిడుగు పడి విద్యార్థి తండ్రి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పాఠశాల నుంచి 2వ తరగతి చదువుతున్న కుమార్తెను ఇంటికి తీసుకువచ్చేందుకు వెళ్లిన శ్రీనివాస్ పిడుగు పడటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మృతుడు స్వగ్రామం రాజమండ్రి కాగా BSR కంపెనీలో సర్వేయర్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2026

GNT: టెన్త్ విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

image

వట్టిచెరుకూరు బీసీ హాస్టల్‌కు చెందిన టెన్త్ విద్యార్థి రాకేశ్ ఆత్మహత్య ఘటనపై మంత్రి సవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి కుటుంబానికి ఆమె సానుభూతి తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఒత్తిడికి గురికాకుండా చూడాలని హాస్టల్ యాజమాన్యానికి సూచించారు. మార్కులే జీవితంలో ముఖ్యం కాదని చెప్పారు.