News May 7, 2025

ఢిల్లీ మేయర్‌గా రాజా ఇక్బాల్

image

ఢిల్లీ కొత్త మేయర్‌గా బీజేపీ అభ్యర్థి రాజా ఇక్బాల్ సింగ్ ఎన్నికయ్యారు. మొత్తం 142 ఓట్లకుగానూ 133 ఓట్లు సాధించి ఇక్బాల్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్‌దీప్ సింగ్‌కు 8 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లలేదు. దీంతో ఇక్బాల్ మేయర్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

Similar News

News March 23, 2026

FASTag.. ఏప్రిల్ 1 నుంచి నగదు చెల్లింపులు బంద్!

image

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులపై పూర్తిగా డిజిటల్ టోలింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు NHAI ప్రకటించింది. ఆ రోజు నుంచి నగదు చెల్లింపులను నిలిపివేసే అవకాశముందని తెలిపింది. ఫాస్టాగ్, UPI ద్వారానే ట్రాన్సాక్షన్స్ ఉంటాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలలో రద్దీని తగ్గించడం, లేన్ల ద్వారా వాహనాల రాకపోకలను మెరుగుపరచడం, వేగవంతమైన టోల్ చెల్లింపులే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామంది.

News March 23, 2026

INTERESTING: గుండె, మెదడు లేని జీవి!

image

సముద్ర గర్భంలో ప్రకృతి సృష్టించిన అద్భుతాలలో ‘స్టార్ ఫిష్’ ఒకటి. దీనికి మిగిలిన జీవులలా మెదడు, గుండె, రక్తం ఉండవు. రక్తానికి బదులుగా ఇది సముద్రపు నీటినే తన శరీరమంతా పంపిస్తూ పోషకాలను పొందుతుంది. దీనిని ‘వాటర్ వాస్క్యులర్ సిస్టమ్’ అంటారు. మెదడు లేకపోయినా, తన నాడీ వ్యవస్థ ద్వారా పరిసరాలను పసిగట్టి ఆహారాన్ని వేటాడటం ఈ జీవి ప్రత్యేకత. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(28/100)

News March 23, 2026

రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

రేపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద, పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దంది.