News May 7, 2025
తిరుపతి జిల్లాకు నాలుగో స్థానం

పల్లెపండుగ కార్యక్రమం కింద తిరుపతి జిల్లాలో 215.50 కి.మీ. పొడవైన CC రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబరిచినందుకు తిరుపతి జిల్లాకు నాలుగో స్థానం లభించింది. జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఎం.రామమోహన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు.
Similar News
News March 16, 2026
కామారెడ్డి: DEOకు ఉపాధ్యాయ సంఘాల వినతి

నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్‌పల్లి ZPHSలో ఉపాధ్యాయుడిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో DEO రాజుకు వినతిపత్రం అందజేశారు. అలాగే 2025లో SEEP సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు గౌరవ వేతనం చెల్లించాలని, జనగణన-2026లో SGTలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యాల సంతోష్, రాజ్ కుమార్ తదితరులున్నారు.
News March 16, 2026
కలెక్టర్‌ను కలిసిన జిల్లా గ్రంథాలయం ఛైర్మన్

జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా మేకపాటి శాంతి కుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు ఆమె పూల బొకే అందజేశారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి సహకారం అందించాలని ఆమె కలెక్టర్‌ను కోరారు.
News March 16, 2026
ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్.. విద్యార్థులకు పాఠాలు

కొణిజర్ల మండల పర్యటనలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చిన్నమునగాల పాఠశాలలో సందడి చేశారు. తరగతి గదిలోకి వెళ్లిన ఆయన స్వయంగా ఉపాధ్యాయునిలా మారి విద్యార్థులకు ఆంగ్ల అక్షరాలు, పదాల ఉచ్చారణను నేర్పించారు. వారితో ముచ్చటించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్.. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.


