News May 7, 2025

NGKL: భారత్ సమిట్‌లో పాల్గొన్న మంత్రి జూపల్లి

image

హైదరాబాదులోని హైటెక్ సిటీ నోవాటెల్ హోటల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన భారత్ సమిట్ కార్యక్రమంలో జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.

Similar News

News March 14, 2026

ఇన్‌స్టాలో అవి చూసి మోసపోకండి!

image

ఇన్‌స్టాలో ఏదైనా వస్తువు కనిపించగానే అరే.. బాగుందే అనుకుంటాం. రేట్ కూడా తక్కువే ఉంది కదా కొందామని చూస్తే COD ఉండదు. వెంటనే ఆన్‌లైన్ పేమెంట్ చేసి బుక్ చేస్తాం. కానీ ఎన్నిరోజులైనా అది మీకు డెలివరీ అవ్వదు. ఎందుకంటే అది ఫేక్ షాపింగ్ వెబ్‌సైట్. ఇలాంటి సైట్లు కుప్పలుగా పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా మహిళలు వీటి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. టెంప్ట్ అవ్వకుండా ట్రస్టెడ్ సైట్లలోనే షాపింగ్ చేయండి.

News March 14, 2026

HYD: పెళ్లి రోజే కుమారుడిని చంపి తల్లి సూసైడ్

image

పెళ్లి రోజు జరుపుకోవాల్సిన ఆ ఇంట్లో విషాదం నెలకొంది. దంపతుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణం తీయగా, మరో చిన్నారిని బలి తీసుకుంది. బోరబండ పెద్దమ్మనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సరదాగా బయటకు వెళ్దామని భార్య కోరగా భర్త నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మనస్తాపంతో పిల్లల గొంతు నులిమి సత్యవేణి సూసైడ్ చేసుకొంది. ఐదేళ్ల కుమారుడు చనిపోగా.. కూతురు ప్రాణాలతో బయటపడింది.

News March 14, 2026

సూర్యాపేట: ప్రశాంతంగా ముగిసిన తెలుగు పరీక్ష

image

జిల్లాలో శనివారం పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈవో అశోక్ తెలిపారు. 69 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 12,355 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 12,342 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అధికారులు 37 కేంద్రాలను తనిఖీ చేశారని ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని, పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీఈవో తెలిపారు.