News May 7, 2025

విడదల రజినికి హైకోర్టులో ఊరట

image

AP: విడదల రజినిపై ముందస్తు చర్యలు తీసుకోవద్దని, ఇదే సమయంలో 41A నోటీసులిచ్చి విచారించాలని ACBని హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని, కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని రజినికి సూచించింది. శ్రీలక్ష్మీ‌బాలాజీ స్టోన్‌క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారంటూ రజినిపై కేసు నమోదు కాగా, ఆమె A1గా ఉన్నారు. ఇదే కేసులో అరెస్టైన ఆమె మరిది గోపి(A3) ముందస్తు బెయిల్ పిటిషన్‌ డిస్పోజ్ అయింది.

Similar News

News April 8, 2026

అమెజాన్‌లో మరో 14 వేల మంది తొలగింపు!

image

అమెజాన్ మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మే 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో 16,000 మందిని తీసేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా AWS, రిటైల్, HR విభాగాల్లోని మిడ్-లెవల్ మేనేజర్లపై ఈ ప్రభావం పడనుంది. AI కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

News April 8, 2026

మోదీజీ ఎవరిని ఫూల్ చేస్తున్నారు: ప్రకాశ్ రాజ్

image

ముద్రా యోజన పథకం ద్వారా 52 కోట్ల మందిని వ్యాపారులుగా మార్చామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. 150 కోట్ల జనాభాలో 52 కోట్ల మంది వ్యాపారులుగా మారారా? అని ప్రశ్నించారు. ఎవరిని ఫూల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతకుముందు ఈ పథకం ద్వారా అనేక మంది వ్యాపార కలలను సాకారం చేశామని ప్రధాని Xలో పోస్ట్‌ చేశారు. దాదాపు 52 కోట్ల మందిని వ్యాపారులుగా మార్చామన్న ‘MyGovIndia’ పోస్ట్‌ను షేర్ చేశారు.

News April 8, 2026

సమ్మర్‌లో ఇది నానబెట్టుకుని తింటే..

image

సమ్మర్‌లో గోండ్ కటీరా బాడీని కూల్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒక నేచురల్ గమ్. Astragalus species అనే మొక్కల వేర్ల నుంచి సేకరిస్తారు. రాత్రి ఒక స్పూన్ కటీరాను గ్లాసు నీటిలో నానబెడితే జెల్లీలా తయారవుతుంది. దీన్ని షర్బత్, పాలు, నిమ్మరసంలో కలుపుకొని తాగాలి. డీహైడ్రేషన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గేందుకు సాయపడుతుంది. వెంట్రుకలు, చర్మ ఆరోగ్యానికీ మంచిది.