News May 7, 2025
MNCL: భారత్ సమ్మిట్‌లో ఎంపీ వంశీకృష్ణ కీలకోపన్యాసం

కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కీలకోపన్యాసం చేశారు. శాంతి, అహింస, ఆర్థిక సమానత్వం వంటి అంశాలపై చర్చలు జరిగే కీలక వేదికగా సమ్మిట్ నిలుస్తుందన్నారు. ఈ సమ్మిట్ వల్ల యువతకు ఆత్మవిశ్వాసం పెరిగి, అవకాశాలు విస్తరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమ్మిట్‌కు 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరవుతుండటం గర్వకారణం అన్నారు.
Similar News
News March 8, 2026
ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు లేదు: SPDCL CMD

TG: ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు ఉండదని SPDCL CMD జితేశ్.వి.పాటిల్ స్పష్టం చేశారు. SPDCL పరిధిలో మొత్తం 1.20 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని, గతేడాదితో పోలిస్తే 12.09L మంది పెరిగారని వెల్లడించారు. ‘గృహాజ్యోతి’ పథకం వల్ల విద్యుత్ చౌర్యం తగ్గిందన్నారు. ఈ ఏడాది FEB వరకు 5.44కోట్ల జీరో బిల్లులు జారీ చేయగా, ప్రభుత్వం నుంచి రూ.1930.66కోట్ల సబ్సిడీ డబ్బులు వచ్చాయని తెలిపారు.
News March 8, 2026
యుద్ధంలోకి వస్తామన్న UK? అవసరం లేదన్న ట్రంప్!

మిడిల్ ఈస్ట్‌కు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను పంపాలని UK అనుకుంటున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ‘ఒకప్పుడు మన గొప్ప మిత్ర దేశమైన UK ఎట్టకేలకు మిడిల్ ఈస్ట్‌కు రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను పంపించాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. కానీ మాకు అవి అవసరం లేదు PM స్టార్మర్. మేం ఆల్రెడీ యుద్ధం గెలిచాం. ఇప్పుడు యుద్ధంలో చేరేవారు మాకు అవసరం లేదు’ అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.
News March 8, 2026
వెలుగుమట్ల భూ వివాదంలో 19 కేసులు నమోదు: డీసీపీ

ఖమ్మం వెలుగుమట్ల భూ వివాదంలో ఇప్పటివరకు 19 కేసులు నమోదైనట్లు అదనపు డీసీపీ(లా అండ్ ఆర్డర్) ప్రసాద్ రావు తెలిపారు. UCCRL (ML) OPDR భూదాన్ కమిటీ సభ్యుల ముసుగులో పేద బాధితుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసి వారిని మోసం చేశారని అన్నారు. దర్యాప్తులో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటికే 19 కేసుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 9మందిని అరెస్టు చేశామన్నారు.


