News May 7, 2025
MNCL: ముగిసిన ఓపెన్ స్కూల్ పరీక్షలు

మంచిర్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజైన శుక్రవారం జరిగిన పదో తరగతి పరీక్షకు మొత్తం ఇద్దరికి ఒక్కరు హాజరయ్యారు. అలాగే ఇంటర్ పరీక్షకు మొత్తం 709కి 619 మంది హాజరు కాగా 90 మంది గైర్హాజరయ్యారు. ఈ నెల 26 నుంచి బెల్లంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని డీఈఓ యాదయ్య తెలిపారు.
Similar News
News March 6, 2026
పెద్దపల్లి: ‘రెవెన్యూ ఫైల్స్ వెంటనే క్లియర్ చేయాలి’

రెవెన్యూ శాఖలో పెండింగ్ ఫైల్స్ వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మార్చి 6 నుంచి వచ్చే దరఖాస్తులను 15 రోజుల్లో డిస్పోస్ చేయాలన్నారు. సమీకృత కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డి.వేణు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిజిటల్ జనగణన, ఏప్రిల్-మేలో హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలని, ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం తెలంగాణ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలతో కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.
News March 6, 2026
BREAKING: ఫైనల్లోకి భారత్

T20WCలో భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 రన్స్ తేడాతో విజయం సాధించింది. 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లిష్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. బెథెల్ సెంచరీతో (48 బంతుల్లో 105) బెంబేలెత్తించినా చివర్లో వికెట్లు పడటంతో భారత్ విజయం సాధించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది.
News March 6, 2026
బుమ్రా@500 వికెట్లు

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 500 వికెట్లు తీశారు. ఇవాళ సెమీఫైనల్లో ENG కెప్టెన్ బ్రూక్‌ను ఔట్ చేసి ఈ క్లబ్బులో చేరారు. 2016లో అరంగేట్రం చేసిన బుమ్రా 235 మ్యాచులు ఆడారు. 18 సార్లు 5 వికెట్లు తీశారు. భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. ఆ లెజెండరీ బౌలర్ 401 మ్యాచుల్లో 953 వికెట్లు పడగొట్టారు.


