News May 7, 2025
చైనా కాదు.. US iPhones భారత్ నుంచే?

US-చైనా వాణిజ్య సంబంధాలు సన్నగిల్లుతున్న నేపథ్యంలో యాపిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. US తమకు సంబంధించిన అన్నీ iPhone మోడల్స్ అసెంబ్లీ యూనిట్స్‌ను చైనా నుంచి భారత్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. 2026 మొదటికల్లా ఈ పని పూర్తవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే INDలో తమిళనాడు శ్రీపెరుంబుదూర్, కర్ణాటక బెంగళూరులోని Foxconn ప్లాంట్లలో ఐఫోన్స్ తయారవుతున్నాయి.
Similar News
News March 16, 2026
నేటి నుంచి పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

జాతీయ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నేటి నుంచి ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని పశుసంవర్థక శాఖ జేడీ ప్రేమ్‌చంద్ తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పశువులకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాకు 3.20 లక్షల మందు డోసులు సరఫరా అయ్యాయని, ప్రతి గ్రామంలోని పశువులకు ముందస్తుగా టీకాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News March 16, 2026
నక్సలైట్ రోల్‌లో పీపుల్స్ స్టార్

స్వీయ దర్శకనిర్మాణంలోనే సినిమాలు చేస్తున్న పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి చాలా ఏళ్ల తర్వాత ఓ బయటి చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ హర్ష తెరకెక్కిస్తున్న హుషారు-2లో నక్సలైట్ పాత్ర పోషిస్తున్నారు. తన ఐడియాలజీకి దగ్గరగా ఉండటంతోనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో టెంపర్ సహా అనేక చిత్రాల కోసం డైరెక్టర్లు సంప్రదించినా ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇకపై ఆయన ఇతరుల సినిమాల్లో నటిస్తారో లేదో వేచి చూడాలి.
News March 16, 2026
గ్యాస్ సిలిండర్ రావాలంటే ఇలా చేయండి..

LPG సిలిండర్ల సరఫరాలో అంతరాయం నెలకొన్న నేపథ్యంలో బుకింగ్ & డెలివరీ సమయంలో ఆటంకాలు రావొద్దంటే వెంటనే eKYC పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. సబ్సిడీ ఆగిపోకుండా, కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలంటే ఇది తప్పనిసరని పేర్కొంది. దీనికోసం1800 233 3555 నంబర్‌కు లేదా మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించండి. లేకపోతే మీ ఆయిల్ కంపెనీ యాప్ డౌన్‌లోడ్ చేసి ‘Aadhaar FaceRD’ యాప్ సాయంతో ఇంటి నుంచే KYC చేసుకోవచ్చు. SHARE IT


