News May 7, 2025

పాడేరు: ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు

image

పాడేరులో శుక్రవారం నిర్వహించిన ఏపీఆర్ఎస్ CAT, ఏపీఆర్‌జేసీ అండ్ ఏపీఆర్‌డీసీ CET 2025 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో పీ.బ్రహ్మాజీరావు తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 5, 6, 7, 8 తరగతులకు సంబంధించి ఏపీఆర్ఎస్ CAT, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఏపీఆర్‌జేసీ అండ్ ఏపీఆర్‌డీసీ CET పరీక్షలు నిర్వహించామన్నారు. CAT పరీక్షకు 176 మంది, CET పరీక్షలకు 591 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.

Similar News

News March 18, 2026

HYD: తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి..!

image

ఇంజినీర్ల బదిలీలు అత్యంత పారదర్శకంగా ఉండేలా నీటిపారుదల శాఖ తీసుకున్న నిర్ణయం బహుశా తెలంగాణ చరిత్రలోనే తొలిసారి కావొచ్చు. బదిలీల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సులు పనిచేయవని సర్క్యులర్‌ జారీ చేసింది. ఏదైనా సిఫార్సు లేఖతో సంప్రదిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. బదిలీల విషయమై అధికార పార్టీ నాయకుల నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ వరకు భారీ సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News March 18, 2026

PDPL: సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచాలి: ఎంపీ

image

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని కోరుతూ ఎంపీ వంశీకృష్ణ బుధవారం ఢిల్లీలో సీఎమ్‌పీఎఫ్ కమిషనర్ సజీశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. స్వల్ప పెన్షన్‌తో కార్మిక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆయన వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్.. నిబంధనల మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News March 18, 2026

నెల్లూరు: దొంగల ముఠా అరెస్ట్

image

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 195 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసిన దొంగలు పట్టుబడ్డారు. వారి నుంచి 400KGల రాగి, 2ఆటోలు, 2బైక్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి SP సుబ్బరాయుడు తెలిపారు. నిందితులు గూడూరు(M) గొల్లపల్లికి చెందిన బండి వాసు(22), బూదూరు మణి(27), కత్తి పోలయ్య(40), చందు(25), ఏకోలు మధు(32)గా గుర్తించారు. మనుబోలు(M) యాచవరానికి చెందిన చల్లా రాఘవ వాళ్ల నుంచి రాగి కొనడంతో అరెస్ట్ చేశారు.