News May 7, 2025

‘NGKL జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి’

image

జిల్లాలో టి.ఓ.యస్.యస్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని డీఈఓ రమేశ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఓపెన్ స్కూల్ పరీక్షలను డీఈఓ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పదో తరగతికి 380 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్‌కి 804 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.

Similar News

News March 16, 2026

సమస్యలు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయండి: ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను ఎస్పీ పరితోష్ పంకజ్ విన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది తమ ఫిర్యాదులను వివరించారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిఐలకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు సూచించారు.

News March 16, 2026

జగిత్యాల: ప్రజావాణికి 57 ఫిర్యాదులు

image

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాజ గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అధికారులు అర్జీలపై సమగ్ర విచారణ జరిపి పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణికి మొత్తం 57 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

News March 16, 2026

GWL: ఫార్మర్ రిజిస్ట్రీ పక్కాగా ఉండాలి- కలెక్టర్

image

డిజిటల్ క్రాఫ్ట్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ పక్కాగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సోమవారం మండలంలోని గోనుపాడు శివారులో పంట పొలాలు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంటల దిగుబడి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మరో నెల రోజుల్లో అన్ని పంటలు చేతికి వస్తాయని రైతులు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.