News May 7, 2025

IPL: APR 25 అంటే CSKకు పండగే..!

image

ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో SRHతో CSK తలపడనుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ధోనీ సారథ్యంలో ఏప్రిల్ 25న జరిగిన మ్యాచుల్లో సీఎస్కే ఓటమే ఎరుగలేదు. ఇదే తేదీల్లో ఆ జట్టు 7 మ్యాచులాడి అన్నింట్లోనూ గెలిచింది. 2010-MI, 2011-PWI, 2013-SRH, 2014-MI, 2015-PBKS, 2018-RCB, 2021లో RCBపై గెలుపొందింది. ఇందులో ఓ ఫైనల్ మ్యాచ్ కూడా ఉండటం విశేషం. మరి ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

Similar News

News March 10, 2026

యుద్ధం ముగించడం మా చేతుల్లో ఉంది: IRGC

image

త్వరలో యుద్ధం ముగుస్తుందన్న <<19341728>>ట్రంప్ కామెంట్లపై<<>> ఇరాన్ IRGC స్పందించింది. ‘యుద్ధం ముగించడం మా చేతుల్లో ఉంది’ అని స్పష్టం చేసింది. ‘ఈ ప్రాంత భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించేది సాయుధ బలగాలు. అమెరికా సైనికులు యుద్ధాన్ని ముగించలేరు. మేము పూర్తి శక్తితో యుద్ధం చేస్తున్నాం. మాపై ఆధిపత్యం ప్రదర్శించామని ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారు’ అని మండిపడింది.

News March 10, 2026

Viral: పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష!

image

TG: ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే చర్యలు తప్పవని మహబూబాబాద్‌కు చెందిన హాల్ యజమాని బోర్డు పెట్టడం వైరల్‌గా మారింది. కొందరు ఇన్విటేషన్ లేకున్నా వస్తుండటంతో చాలా మంది తమ హాల్‌లో ఫంక్షన్లు చేయట్లేదని, దీంతో గిరాకీ తగ్గిందని ఆయన చెప్పారు. దీన్ని నివారించేందుకే ఫంక్షన్ హాల్ ఎదుట.. ‘ఆహ్వానం లేకుండా ఎవరైనా వస్తే 441 సెక్షన్ కింద 3నెలల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తాం’ అని బోర్డు పెట్టారు.

News March 10, 2026

ఇకపై 4 కేటగిరీలుగా పంచాయతీలు

image

AP: జనాభా, ఆదాయం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పంచాయతీల పునర్విభజనకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 3 రకాలుగా ఉన్న పంచాయతీలు ఇకపై 4 రకాలు కానున్నాయి. 10Kకు పైగా జనాభా, ₹కోటి వార్షిక ఆదాయం ఉన్న వాటిని రూర్బన్ పంచాయతీలుగా పరిగణించి పట్టణ తరహా సౌకర్యాలు కల్పిస్తారు. 3K-10K జనాభా, ₹30Lపైన ఆదాయం ఉంటే గ్రేడ్-1, 2Kలోపు జనాభా ఉంటే గ్రేడ్-2, 1,500 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్-3లో చేరుస్తారు.