News May 7, 2025
NZB కళాశాలకు ప్రతిష్ఠాత్మక అవార్డు

నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ అవార్డు-2025కు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రాంమెాహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఎడ్యుకేషన్ వరల్డ్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. స్వయం ప్రతిపత్తి హోదాలో ఉత్తమ ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రంలో ఐదో స్థానం సాధించిందని పేర్కొన్నారు.
Similar News
News March 27, 2026
NZB: ట్రావెల్స్ బస్సుల్లో వెళ్తున్నారా..?

మార్కాపురం ఘోర ప్రమాదం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిజామాబాద్, కామారెడ్డిల నుంచి హైదరాబాద్, ముంబై, బెంగళూరుకు నిత్యం ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో అధిక శాతం ఫిట్‌నెస్ లేకపోవడం, అతివేగం, నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేయడం ప్రమాదాలకు దారితీస్తోంది. గతంలో ఇందల్వాయి, భిక్నూర్ వద్ద జరిగిన ప్రమాదాలు నిర్లక్ష్యాన్ని చాటిచెప్పాయి.
News March 26, 2026
NZB: అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరాదు: దినేష్ రెడ్డి

ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో పెట్రోల్, డీజిల్ పై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరాదని రాష్ట్ర పెట్రోల్ పంప్ డీలర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్ల దినేష్ రెడ్డి కోరారు. గురువారం ఆయన ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ.. ఇది పెట్రోల్ పంప్ యజమానులు చేస్తున్న పనిగా కొందరు మాట్లాడడం బాధాకరంగా ఉందన్నారు. ప్రజలు అవసరానికి మించి పెట్రోల్ పోయించుకుంటున్నందున అత్యవసర సేవలకు ఆటకం కలుగుతున్నదన్నారు.
News March 26, 2026
NZB: ఆయిల్ పామ్ లక్ష్య సాధనకు కృషి చేయాలి: కలెక్టర్

నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా NZB జిల్లాలో ఆయిల్ పామ్ సాగు జరిగేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల అధికారులు, నర్సరీ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో రైతులను ప్రోత్సహిస్తూ జిల్లాలో ఈ ఏడాది 7 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరిగేలా అంకిత భావంతో పని చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.


