News March 29, 2024
విశాఖలో తొలిసారిగా బ్రెయిలీ లిపిలో ఫిర్యాదు

విశాఖలో తొలిసారిగా ఒక దివ్యాంగుడు బ్రెయిలీ లిపిలో ఇచ్చిన ఫిర్యాదుపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. దిశా దివ్యాంగ్ సురక్ష ద్వారా ఈ నెల 15న డయల్ యువర్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కోటవురట్లకు చెందిన ఒక దివ్యాంగుడు ఫోన్ చేసి.. అధిక లాభాలు ఇస్తామని చెప్పి ఒక సంస్థ తమ వద్ద డబ్బులు తీసుకొని మోసం చేసిందని బ్రెయిలీ లిపిలో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 15, 2026
మెరుగైన ర్యాంకు కోసం GVMC కసరత్తు

స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 సర్వే నేపథ్యంలో నగర ర్యాంకు మెరుగుదలపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే నెల ఢిల్లీ బృందం పరిశీలనకు రానుంది. దీంతో జీవీఎంసీ పర్యవేక్షణను పెంచి సిబ్బంది పనితీరును సమీక్షిస్తోంది. పారిశుద్ధ్య లోపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అవగాహన కార్యక్రమాలతో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ, మెరుగైన ర్యాంకే లక్ష్యంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
News February 15, 2026
రుషికొండ బీచ్‌లో బీటెక్ విద్యార్థి మృతి

రుషికొండ బీచ్‌లో మునిగి యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విశాఖలో బీటెక్ చదువుతున్న అరవింద్( 21) తన స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తుండగా.. అరవింద్‌తో పాటు రాజీవ్ సముద్రంలో కొట్టుకొనిపోయారు. వెంటనే స్పందించిన లైఫ్ గార్డ్స్ వారిని ఒడ్డుకి తీసుకొచ్చారు. అప్పటికే అరవింద్ చనిపోయాడు. రాజీవ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.
News February 15, 2026
సోమవారం జీవీఎంసీలో పీజీఆర్ఎస్ రద్దు: కమిషనర్

విశాఖలో ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి, IFR-2026 కార్యక్రమం ఏర్పాట్లు, సమన్వయ సమావేశాలలో సంబంధిత అధికారిక కార్యక్రమాలలో జీవీఎంసీ అధికారులు పాల్గొనున్నారు. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, అన్ని జోనల్ కార్యాలయాలలో నిర్వహించాల్సిన PGRSను రద్దు చేసినట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.


