News May 7, 2025
ఆర్మీ నర్సింగ్ కాలేజీ వెబ్‌సైట్ హ్యాక్.. పాకిస్థానీల పనేనా?

పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ నర్సింగ్ కాలేజీ వెబ్‌సైట్‌ను పాకిస్థాన్ హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య రెచ్చగొట్టే నినాదాలతో ఓ ఇమేజ్ పోస్ట్ చేశారు. హ్యాకర్ల బృందం తమను ‘టీమ్ ఇన్‌సేన్ పీకే’ అంటూ రాసుకుంది. దీనిని పరిష్కరించేందుకు భారత సైన్యం అత్యవసర చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను సంప్రదించింది.
Similar News
News March 16, 2026
‘స్వప్నం’ నెరవేర్చుకుంది.. 2 నెలల్లో 5 బ్యాంకు ఉద్యోగాలు

AP: బ్యాంకు ఉద్యోగం సాధించాలనే తన లక్ష్యానికి పెళ్లి అడ్డుకాదని నిరూపించారు విశాఖకు చెందిన స్వప్న. డిగ్రీ వరకు చదివిన ఈమె వివాహం తర్వాత శ్రీకాకుళం(D) జొన్నలపాడులో అత్తగారింట్లో పట్టుదలతో చదివారు. 2 నెలల వ్యవధిలోనే ఏకంగా 5 బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. JAN 15న IBPS PO, FEB 23న RBO PO, FEB 27న SBI జూనియర్ అసోసియేట్, మార్చి 2న BOBలో క్లర్క్, మార్చి 15న APGBలో క్లర్కు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
News March 16, 2026
ఆయన త్యాగఫలమే ప్రత్యేక రాష్ట్రం

ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి నేడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఈ త్యాగ ఫలితంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది పడింది. గాంధీజీకి శ్రీరాములు అంటే ఎంతో అభిమానం. అందుకే ‘శ్రీరాములు లాంటి వారు మరో పదిమంది ఉంటే ఏడాదిలోనే స్వరాజ్యం తెస్తాను’ అని గాంధీజీ చెప్పేవారు.
News March 16, 2026
నాడు ఫ్రీగా యాక్టింగ్.. నేడు ₹5.5 కోట్ల రాయల్టీ!

ఆస్కార్ అవార్డు పొందిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రం తనను మిలియనీర్‌ను చేసిందని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ‘నిర్మాతలు తన ఫీజును భరించలేమని చెప్పడంతో ఫ్రీగా నటించా. అయితే సినిమా ఘనవిజయం సాధించాక వారు స్వచ్ఛందంగా పంపిన రాయల్టీ ద్వారా ₹5.5 కోట్లకు పైగా అందుకున్నా. ఇటీవలే రూ.3లక్షల చెక్ వచ్చింది’ అని ఆయన చెప్పుకొచ్చారు.


