News May 7, 2025

HYD: ఓయూలో పరీక్షలు వాయిదా

image

ఉస్మానియా యూనివర్సిటీ ప్రీ పీహెచ్‌డీ (పీహెచ్‌డీ కోర్స్ వర్క్) పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించారు. వివిధ సాంకేతిక కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేసుకున్నట్లు వివరించారు. తిరిగి నిర్వహించబోయే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.SHARE IT

Similar News

News September 15, 2025

కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య.. జైలుకు నిందితులు

image

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేణు అగర్వాల్ హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. రాంచీ నుంచి నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మను పోలీసులు కూకట్‌పల్లికి తీసుకొచ్చారు. ట్రాన్సిట్ వారెంట్‌పై స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. కంది జైలుకు తరలించినట్లు సమాచారం.

News September 15, 2025

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర: కేటీఆర్

image

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ఆగం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.

News September 15, 2025

జూబ్లీహిల్స్: ప్రతి బూత్‌కు 10 మంది

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ విజయం సాధించాలని సీఎం కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దాదాపు 407 బూత్‌లలో చురుకైన కార్యకర్తలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఒక్కో బూత్‌కు 10 మంది చొప్పున ఎంపిక చేసి హస్తానికే ఓట్లు దక్కేలా చూడాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నెల 21లోపు ఎంపిక పూర్తిచేయనున్నారు.