News May 7, 2025

HYD: ఓయూలో పరీక్షలు వాయిదా

image

ఉస్మానియా యూనివర్సిటీ ప్రీ పీహెచ్‌డీ (పీహెచ్‌డీ కోర్స్ వర్క్) పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించారు. వివిధ సాంకేతిక కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేసుకున్నట్లు వివరించారు. తిరిగి నిర్వహించబోయే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.SHARE IT

Similar News

News March 12, 2026

క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

image

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ B.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని, మున్సిపల్ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

News March 12, 2026

అనకాపల్లి జిల్లాలో వారందరి ఖాతాల్లో రూ.134 కోట్లు జమ!

image

అనకాపల్లి జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద 2,42,536 మంది లబ్ధి కలుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. వీరి ఖాతాల్లో ఈ నెల 13న రూ.134.27 కోట్లు జమ అవుతాయన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో 22,202 మంది, చోడవరంలో 51,269, మాడుగుల 45,604, ఎలమంచిలి 33,648, నర్సీపట్నంలో 35,147, పెందుర్తి 15,364, పాయకరావుపేటలో 39,302 మందికి ఈ పథకం వర్తిస్తుందన్నారు.

News March 12, 2026

JEE MAIN: దరఖాస్తులకు మరో ఛాన్స్!

image

జేఈఈ మెయిన్‌ సెషన్-2కు దరఖాస్తు చేసుకునేందుకు NTA మరో అవకాశం ఇచ్చింది. విద్యార్థుల నుంచి వినతులు రావడంతో రిజిస్ట్రేషన్ల విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది. రేపు రాత్రి 9 గంటల వరకు <>ఆన్‌లైన్‌<<>>లో అప్లై చేసుకోవచ్చని సూచించింది. అయితే ఇప్పటికే సబ్మిట్ చేసిన అప్లికేషన్లలో మార్పులకు పర్మిషన్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 2 నుంచి 9 వరకు పరీక్షలు జరగనున్నాయి.