News May 7, 2025
బాపట్లలో మహిళల జీవనోపాధిపై ప్రత్యేక సమావేశం

బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి జిల్లా స్థాయి అధికారులతో కలిసి పొదుపు మహిళల జీవనోపాధి వృద్ధి కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలకు ఆర్థిక స్వావలంబనకు సంబంధించి వివిధ కార్యక్రమాలపై చర్చించారు. మహిళల స్వయం సహాయక సంఘాల సామర్థ్యాన్ని పెంచడం, వృత్తి, శిక్షణా కార్యక్రమాల ద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం వంటివి సమావేశంలో ప్రధాన అంశాలుగా పేర్కొన్నారు.
Similar News
News March 14, 2026
మహిళల సాధికారతకు ప్రభుత్వం కృషి: మంత్రి దామోదర

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ హాస్పిటల్‌లో ‘షి పవర్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విమెన్స్ కాంక్లేవ్’లో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘షి పవర్ మొబైల్ యాప్’ను ఆయన ఆవిష్కరించారు. మహిళా సాధికారతపై జరిగిన ప్యానెల్ డిస్కషన్‌లో వివిధ రంగాల మహిళా నిపుణులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
News March 14, 2026
ప్రాణాలు కాపాడుతున్న పోలీసులు!

అర్థరాత్రి, తెల్లవారుజామున జరిగే ప్రమాదాలను అడ్డుకునేందుకు జిల్లా పోలీసులు శనివారం వినూత్నంగా ‘స్టాప్ వాష్ గో’ కార్యక్రమం నిర్వహించారు. SP ఆదేశాలతో జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాలను నిలిపి డ్రైవర్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్ల కలిగే ముప్పును తప్పించేందుకు లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నారు. పోలీసుల ఈ చొరవతో ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
News March 14, 2026
కామారెడ్డి: చిరుత కళేబరం లభ్యం

బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట అటవీ ప్రాంతంలో చిరుతపులి కళేబరం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారి హబీబ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేటగాళ్ల దుశ్చర్యగా భావిస్తున్న ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


