News May 7, 2025

గుంటూరు: ప్రధాని మోదీ పర్యటనకు సుందర శోభ 

image

మే 2న ప్రధాని మోదీ అమరావతికి రానున్న నేపథ్యంలో, గన్నవరం విమానాశ్రయం నుంచి వీఐపీ మార్గాలపై ఆకర్షణీయంగా తబలా ఆకారంలో పూల కుండీలను అమరావతి అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసింది. ఏడీసీ ఛైర్‌పర్సన్ డి. లక్ష్మీపార్థసారథి ఆదేశాలతో గ్రీనరీ విభాగం అధికారుల నేతృత్వంలో ఈ పనులు పూర్తయ్యాయి. పూల కుండీలు మార్గాన్ని మరింత అందంగా మార్చుతూ, మోదీ పర్యటనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. 

Similar News

News March 22, 2026

తెనాలిలో అష్ట దిగ్గజాలకు ‘కీర్తి కిరీటం’ పురస్కారాలు

image

తెనాలిలోని రత్నా కళ్యాణ మండపంలో ఈ నెల 31న ‘మా-ఏపీ’ ఆధ్వర్యంలో ‘అష్ట దిగ్గజాలకు కీర్తి కిరీటం’ పేరిట ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమ వివరాలను దర్శకుడు దిలీప్ రాజ వెల్లడించారు. కలెక్టర్ అన్సారియా ముఖ్య అతిథిగా విచ్చేసి SP వకుల్ జిందాల్, కత్తెర సురేశ్ కుమార్, కుర్ర శ్రీను, డాక్టర్ శారద, వజ్రాల రామలింగాచారి సహా పలువురు ప్రముఖులకు పురస్కారాలను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News March 22, 2026

గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే!

image

గుంటూరులో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 320, విత్ స్కిన్ రూ. 300కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 960 వద్ద స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ. 430, రాగండి రూ. 180, బొచ్చెలు రూ. 230. చికెన్ ధరలు పెరగడంతో చేపలను కొనుగోలు చేయడానికి నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి..

News March 22, 2026

గ్యాస్ కొరత లేదు.. ఆందోళన పడొద్దు: గుంటూరు JC

image

గుంటూరు జిల్లాలో గృహ అవసర గ్యాస్ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ భరోసా ఇచ్చారు. గుంటూరు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎల్.పి.జీ ఏజెన్సీను శనివారం జేసీ తనిఖీ చేశారు. ఏజెన్సీలో ఉన్న కనెక్షన్లు, బుకింగ్ చేసినవి, అందుబాటులో ఉన్న సిలిండర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులతో ముఖాముఖి మాట్లాడి బుక్ చేసిన వివరాలు అడిగి తెలుసున్నారు.