News May 7, 2025
రాష్ట్రంలో భగ్గుమంటున్న ఎండలు

AP: ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA తెలిపింది. అలాగే రాష్ట్రంలో 169 ప్రాంతాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా గాజులపల్లె, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రేపు రాష్ట్రంలోని 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 28 మండలాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది.
Similar News
News April 3, 2026
ట్రంప్ స్పీచ్ ఎఫెక్ట్.. నాలుగేళ్ల గరిష్ఠానికి చేరిన US ఆయిల్ ధర!

యుద్ధం ముగింపుపై US అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆ దేశ ఆయిల్ ధరలు భగ్గుమన్నాయి. WTI క్రూడ్ బ్యారెల్ ధర అంతకుముందుతో పోలిస్తే ఏకంగా 11.42% పెరిగి $111.15కు చేరింది. 2022 తర్వాత అమెరికన్ క్రూడ్ ఆయిల్ ధర ఈస్థాయిలో పలకడం ఇదే తొలిసారి. మరోవైపు యూకేకు చెందిన బ్రెంట్ క్రూడ్ 7.87% పెరిగి ఒక బ్యారెల్ ధర $109కు చేరింది. ఇక గల్ఫ్‌లోని ముర్బాన్ క్రూడ్ బ్యారెల్ ధర 114.8 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
News April 3, 2026
మొన్న క్లాసెన్, నిన్న అభిషేక్.. SRH ఫ్యాన్స్ ఆగ్రహం

IPL: SRH బ్యాటర్లు క్లాసెన్, అభిషేక్ క్యాచ్ ఔట్ డెసిషన్లపై ఆ జట్టు ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. MAR 28వ తేదీన RCB మ్యాచులో క్లాసెన్ క్యాచ్ పట్టిన సాల్ట్ బౌండరీ లైనుకు తగిలినా ఔట్ ఇచ్చారని చర్చ జరిగిన విషయం తెలిసిందే. నిన్న KKRతో మ్యాచులో అభిషేక్ క్యాచును వరుణ్ అందుకున్నారు. బాల్ బౌన్స్ అయి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లినట్లు కనబడుతున్నా థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చారని మండిపడుతున్నారు. ఈ 2 ఔట్‌లపై మీ COMMENT.
News April 3, 2026
శర్వానంద్ ‘బైకర్’ మూవీ రివ్యూ&రేటింగ్

తన కొడుకు మోటోక్రాస్ ఛాంపియన్ కావాలని కలల కనే తండ్రి(రాజశేఖర్), మధ్యలోనే రేసింగ్ ఆపేసే కొడుకు(శర్వానంద్) మధ్య జరిగే కథే బైకర్. శర్వా, రాజశేఖర్ నటనతో మెప్పించారు. బైక్ రైడింగ్ విజువల్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. హీరోయిన్ మాళవిక పాత్రకు ప్రాధాన్యం దక్కింది. కొన్ని డైలాగులు బాగున్నాయి. మ్యూజిక్ ఫర్వాలేదు. ఎమోషన్ సీన్లు పెద్దగా వర్కౌట్ కాలేదు. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే మైనస్.
రేటింగ్: 2.5/5


