News May 7, 2025
పార్వతీపురం: ‘రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించడం అభినందనీయం’

పార్వతీపురం మన్యం జిల్లా SSC ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఛాంబర్‌లో కలెక్టర్‌ను జిల్లా విద్యా శాఖాధికారి రమా జ్యోతి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం పట్ల ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని ఆమె పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మంచి ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ కోరారు.
Similar News
News March 22, 2026
కృష్ణా: మళ్లీ కిరోసిన్ ముచ్చట

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 దశాబ్దాల క్రితం నిత్యావసరంగా ఉన్న కిరోసిన్.. మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. గ్యాస్, విద్యుత్ పొయ్యిల రాకతో ప్రభుత్వం కిరోసిన్ సరఫరా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ యుద్ధాల కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందని, వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో కిరోసిన్ పంపిణీ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై అటు అధికారులు, ఇటు ప్రజల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
News March 22, 2026
లక్ష్యాన్ని మించి రబీ సాగు!

AP: మొంథా, దిత్వా తుఫాన్లతో భారీ వర్షాలు కురిసినా రబీ సాగుకు ఆటంకం కలగలేదు. ఈ సీజన్‌లో 20.79L హెక్టార్లలో 22 పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా ఏకంగా 27.36L హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, అపరాలు, చిరు ధాన్యాలు, పొగాకు, నూనె గింజలను సాగు చేశారు. కృష్ణా, గోదావరి డెల్టాలతోపాటు నదులు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతోనే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.
News March 22, 2026
జిల్లాలో నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ కసరత్తు

భద్రాద్రి జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారు, ఎన్నికల ముందు చేరి గెలుపునకు కృషి చేసిన నేతల వివరాలను సేకరిస్తోంది. త్వరలోనే పదవుల ప్రకటన ఉండే అవకాశం ఉండటంతో అంతర్గతంగా వడపోత సాగిస్తోంది. ఏళ్ల తరబడి జెండా మోసిన కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆశావహుల ప్రయత్నాలు పెరిగాయి.


