News May 7, 2025
ఒక్క చుక్క నీరు కూడా పాకిస్థాన్‌కు పోనివ్వం: కేంద్రమంత్రి

సింధు నదీజలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా పాకిస్థాన్‌కు పోనివ్వమని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి CR పాటిల్ స్పష్టం చేశారు. అమిత్‌షాతో జరిగిన భేటీలో రోడ్ మ్యాప్ తయారు చేసినట్లు తెలిపారు. షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ విధానాలపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే సింధు జలాలను మళ్లించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే సింధు, దాని ఉపనదులపై ఉన్న డ్యాం గేట్లను మూసివేశారు.
Similar News
News August 10, 2025
పోలింగ్ సెంటర్ల మార్పు.. వ్యూహంలో భాగమేనా?

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న TDP, YCP గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించాయి. అయితే తమకు మద్దతిచ్చే ఎర్రబల్లి, నల్లగొండవారిపల్లి, నల్లపురెడ్డిపల్లి ఓటర్ల పోలింగ్ సెంటర్లను 2-4KM దూరానికి మార్చారని జగన్‌తో సహా YCP నేతలు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామాల ఓటర్లే తమ గెలుపునకు కీలకం కానున్నారని, వారిని ఓటింగ్‌కు దూరం చేయాలనే దుర్బుద్ధితోనే TDP ఇలా చేసిందని మండిపడుతున్నారు.
News August 10, 2025
రాబర్ట్ వాద్రా రూ.58 కోట్లు తీసుకున్నారు: ED

ఆర్థిక నేరం కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త <<16104501>>రాబర్ట్<<>> వాద్రాకు ఉచ్చు బిగుస్తోంది. అక్రమ ల్యాండ్ డీల్ వ్యవహారంలో ఆయనకు రూ.58 కోట్ల ముడుపులు అందినట్లు ఛార్జ్‌షీట్‌లో ED పేర్కొంది. స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ.53 కోట్లు, బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ.5 కోట్లు పొందారంది. ఈ డబ్బుతో ఆయన స్థిరాస్తుల కొనుగోళ్లతో పాటు పెట్టుబడులు పెట్టారని తెలిపింది.
News August 10, 2025
తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతాం: ఉత్తమ్

TG: తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును కట్టి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేవాదుల పంపుహౌస్ పరిశీలించిన ఆయన అక్కడి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైందని తెలిపారు. భూసేకరణ కోసం రూ.67 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. పెండింగ్ బిల్లులనూ త్వరలో మంజూరు చేస్తామన్నారు.