News May 7, 2025

గంజాయి కేసుల్లో నిందితుడి ఆస్తులు సీజ్: CI దీనబంధు

image

గంజాయి కేసుల్లో నిందితుడి ఆస్తులను సీజ్ చేశారు. ముంచంగిపుట్టు మం. దోడుపుట్టు పంచాయతీ గత్తురుమండకి చెందిన కిల్లో వాసుదేవ్  గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న వాసుదేవ్ పాడేరులో నివాసం ఉంటున్నాడని CI దీనబంధు శుక్రవారం తెలిపారు. వాసుదేవ్ భార్య, బంధువుల పేర్లపై రూ.1.40 కోట్లు (గంజాయి ద్వారా వచ్చిన ఆస్తులు) ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలడంతో వాటిని సీజ్ చేశామన్నారు.

Similar News

News March 16, 2026

NTR: ఆ పంచాయతీల్లో RR యాక్ట్ అమలాయ్యేనా..?

image

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై NTR కలెక్టర్ లక్ష్మీశ కఠిన చర్యలు చేపట్టారు. పెనుగంచిప్రోలు, ముత్యాల, కంచికచర్ల, రామవరప్పాడు సర్పంచులు, అధికారులు రూ. కోట్లలో నిధులు పక్కదారి పట్టించడంతో రికవరీకి ‘రెవెన్యూ రికవరీ’ యాక్ట్ ప్రయోగించారు. అయితే నిందితులు రాజకీయ పలుకుబడితో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిధుల రికవరీ ప్రక్రియ ఇప్పుడు కలెక్టర్‌కు సవాలుగా మారింది.

నేను పార్టీ మారడం లేదు: ఎమ్మెల్యే మల్లారెడ్డి

image

తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీ మారుతున్నాననే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. “నా వయస్సు 73 ఏళ్లు, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో నాకు బాగా తెలుసు” అని పేర్కొన్న ఆయన కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే లాంటిదని ఎద్దేవా చేశారు. ఇటీవల CMని కలిసింది కేవలం తన ఓ వేడుకకు ఆహ్వానించడానికి మాత్రమేనన్నారు.