News May 7, 2025
NLG: వచ్చేనెల 3 వరకు పింఛన్ల పంపిణీ

వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళల పింఛన్లు నేటి నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని పింఛనుదారులు గమనించి పోస్టాఫీసుల ద్వారా తమ పింఛన్లను పొందాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి పత్రికా ప్రకటనలో తెలిపారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా పింఛన్ పొందాలని సూచించారు.
Similar News
News March 19, 2026
నాగార్జునసాగర్: 536 అడుగులకు చేరిన నీటిమట్టం

నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు కాగా), గురువారం మూడు గంటల వరకు 536.30 అడుగులు (180.7024 టీఎంసీలకు చేరుకుంది). ఇందులో సాగర్ ఎడమ కాలువకు 8023 క్యూసెక్కులు, కుడికాలువకు 1023 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 2000 క్యూసెక్కులు, ఎల్ఎల్‌సీ వరద కాలువకు 300 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లోగా 18864 క్యూసెక్కులు ఎగువ నుంచి వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు.

నల్గొండ: పుచ్చకాయకు దక్కని ధర: రైతు కుదేలు

ఈ వేసవిలో జిల్లాలో సుమారు 2000 ఎకరాల్లో పుచ్చకాయ సాగు చేసిన రైతులు మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పెద్దవూర మండలంలోని పలు గ్రామాల్లో సాగు పెరగడం, పంట ఒక్కసారిగా మార్కెట్‌కు రావడంతో గతంలో రూ.30 పలికిన ధర ప్రస్తుతం రూ.6 నుండి 7కి పడిపోయింది. దీంతో పెట్టుబడి కూడా రాక రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.