News March 29, 2024
మందకృష్ణ ఆశయం త్వరలోనే నెరవేరుతుంది: సత్యకుమార్

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కావలసిన అవసరముందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నట్లు బీజేపీ నేత సత్యకుమార్ తెలిపారు. ధర్మవరం కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తనకు ఆయన సంపూర్ణ మద్దతు ఇచ్చారన్నారు. తన నివాసానికి వచ్చిన మందకృష్ణతో సత్య తాజా రాజకీయాలపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ ఆశయం త్వరలో నెరవేరుతుందన్నారు.
Similar News
News October 29, 2025
అనంత జిల్లాలో 80.4 మి.మీ వర్షపాతం నమోదు

అనంత జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 80.4 మి.మీ కురిసింది. అత్యధికంగా తాడిపత్రి మండలంలో 10.8 మి.మీ, ఎల్లనూరు 10.2, పుట్లూరు 9.8, గుత్తి 6.8, పెద్దవడుగూరు 6.0, యాడికి 5.0, నార్పల 4.8, పెద్దపప్పూరు 4.4, గార్లదిన్నె 4.0, BKS 3.0, గుంతకల్ 2.4, శింగనమల 2.4, కూడేరు 2.0, ఆత్మకూరు 2.0, అనంతపురం అర్బన్ 2.0, పామిడి 1.4, కళ్యాణదుర్గం 1.2, రాయదుర్గం మండలంలో 1.0 కురిసింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.
News October 29, 2025
గుత్తి: తుపాన్ ఎఫెక్ట్ ధర్మవరం – మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలు రద్దు

మొంథా తుపాన్ ప్రభావంతో ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు సర్వీసును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. MTM – DMM వెళ్లనున్న రైలు సేవలు రద్దయ్యాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. బుధవారం ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు (17215)ను కూడా రద్దు చేశామన్నారు.
News October 28, 2025
‘విధులకు హాజరు కాని ముగ్గురు డాక్టర్లకు మెమోలు జారీ’

ప్రభుత్వ డాక్టర్లు విధులకు సరిగా హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో దేవి హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో సరిగా విధులకు హాజరుకాని వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. జిల్లాలోని తిమ్మంపల్లి, నాగసముద్రం, బొమ్మనహాల్ వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాప్ విధుల్లో లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


