News May 7, 2025
వేసవి రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా మీదుగా ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీ మేరకు విజయవాడ మీదుగా చర్లపల్లి(CHZ), విశాఖపట్నం(VSKP) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు నుంచి మే 30 వరకు ప్రతి శుక్రవారం VSKP- CHZ(నం.08579), ఏప్రిల్ 26 నుంచి మే 31 వరకు ప్రతి శనివారం CHZ-VSKP(నం.08580) మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, కైకలూరు, గుడివాడలో ఆగుతాయని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News March 13, 2026
ఉస్మానియా తరలింపు వెనక అసలు ప్లాన్ ఇదే!

ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌కు తరలించే ప్రక్రియ ఈ బడ్జెట్ సమావేశాల్లో అత్యంత కీలకం కానుంది. అఫ్జల్‌గంజ్‌లోని 26 ఎకరాల భూమిని ‘హెల్త్ టూరిజం’ పేరుతో కార్పొరేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం లోలోపల కసరత్తు చేస్తోందని సమాచారం. పాత వారసత్వ భవనాన్ని కేవలం మ్యూజియంగా మార్చి, మిగిలిన ఖాళీ స్థలంలో వాణిజ్య సముదాయాలు నిర్మించే ప్రతిపాదన బడ్జెట్ ప్రసంగంలో ‘పరోక్షంగా’ వెల్లడికానుంది.

టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు ఇలా ప్లాన్ చేసుకోండి!

TG: టెన్త్ విద్యార్థుల బోర్డు పరీక్షలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి జరిగే పరీక్షల కోసం మొదటగా హాల్ టికెట్, పెన్నులు సిద్ధం చేసుకోండి. పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోండి. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి ప్రతి ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో ముందే ప్లాన్ చేసుకోండి. మీకు బాగా వచ్చిన సమాధానాలను ముందుగా రాయండి. చివరి 10 నిమిషాల్లో రాసిన జవాబులన్నింటినీ ఓసారి సరిచూసుకోండి. ALL THE BEST