News May 7, 2025

‘డీపీఆర్‌వో‌గా బాలకృష్ణ బాధ్యతలు స్వీకరణ’

image

జిల్లా డీపీఆర్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిని ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వ పధకాలను ప్రజల్లోని తీసుకుని వెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ డీపీఆర్‌వోకి సూచించారు.

Similar News

News April 3, 2026

కల్తీ పాలపై ఉక్కుపాదం: కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలో అనధికారిక పాల విక్రయాలపై కలెక్టర్ కీర్తి చేకూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ పాలను అరికట్టేందుకు పాల ఉత్పత్తిదారులు, విక్రేతలు తప్పనిసరిగా FSSAI వద్ద నమోదు చేసుకోవాలని ఆదేశించారు. పర్యవేక్షణ కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నాణ్యమైన పాలు మాత్రమే విక్రయించాలని ఆమె స్పష్టం చేశారు.

News April 3, 2026

తూర్పుగోదావరి జిల్లాకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానం

image

రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(PHC/UPHC) సేవలలో తూ.గో. జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు DMHO కె.వెంకటేశ్వరరావు ప్రకటించారు. శుక్రవారం బొమ్మూరులోని కార్యాలయం వద్ద సిబ్బందితో కలిసి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సానుకూల అభిప్రాయం ఫిబ్రవరిలో 74.8\% ఉండగా, మార్చిలో అది 77.8%కి పెరిగిందని ఆయన తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆయన కొనియాడారు.

News April 3, 2026

తూ.గో: పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

image

తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డీపీఓ వి.శాంతమణి అధికారుల జాబితాను విడుదల చేశారు. నియమితులైన అధికారులు తక్షణమే బాధ్యతలు స్వీకరించి గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పాలనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.