News May 7, 2025
నిర్మల్: ‘లబ్ధిదారుల గుర్తింపు వేగవంతం చేయాలి’

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పూర్తి చేసిన లబ్ధిదారుల గుర్తింపు వివరాలను మండలాల వారీగా ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులతో కలిసి లబ్ధిదారుల జాబితాలో అర్హులను గుర్తించాలన్నారు.
Similar News
News March 10, 2026
కర్నూలు నగరపాలక సంస్థకు స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ సిరి

కర్నూలు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్ ఏ.సిరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు కమిషనర్ విశ్వనాథ్‌ను నందికొట్కూరుకు, కర్నూలు ఆర్డీవోను గూడూరుకు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. ఆదోనికి జాయింట్ కలెక్టర్, ఎమ్మిగనూరుకు స్థానిక ఆర్డీవోను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
News March 10, 2026
కాకి ఇంటి ముందుకు వస్తే శుభమా? అశుభమా?

జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుని వాహనం కాకి. దాన్ని ‘కాలజ్ఞాని’గా భావిస్తారు. ఇంటి ముందు కాకి అరిస్తే అతిథులు వస్తారని నమ్మకం. అయితే అది వింత స్వరంతో అరిచినా, గుంపు వచ్చి వాలినా ఆపదలకు సంకేతమని జ్యోతిషులు చెబుతున్నారు. ఇక కాకి ఇంటి లోపలికి రావడం అయితే తీవ్ర అశుభమని అంటున్నారు. ఇది ఏదైనా చెడు వార్తను లేదా పెద్ద విపత్తును సూచిస్తుందట. అయితే ఇవన్నీ విశ్వాసాలే తప్ప శాస్త్రీయ ఆధారం లేదని గమనించాలి.
News March 10, 2026
యుద్ధ ప్రభావంతో ఆగిన అరటి ఎగుమతులు

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అనంతపురం జిల్లా అరటి రైతులపై తీవ్రంగా పడింది. ఇరాన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో టన్ను ధర రూ.22 వేల నుంచి రూ.9 వేలకు పడిపోయింది. వ్యాపారస్తులు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో తోటల్లోనే పంట పండిపోతోంది. పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొనడంతో రైతులు దిగులు చెందుతున్నారు. గిట్టుబాటు ధర లేక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


