News May 7, 2025

కాల్వశ్రీరాంపూర్‌లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కలెక్టర్

image

కాల్వ శ్రీరాంపూర్ మండల ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నమూనా ఇందిరమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి ప్రారంభించారు. నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని అన్నారు. ఇంటి నిర్మాణ ప్రతి దశలో ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రీన్ ఛానల్ ద్వారా4 విడతలలో నిధులు విడుదల చేశామన్నారు.

Similar News

News March 14, 2026

NGKLలో నిప్పుల కొలిమి.. 39 డిగ్రీల ఉష్ణోగ్రత

image

నాగర్ కర్నూల్ జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కల్వకుర్తిలో 39.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాలైన శిరసనగండ్ల (38.9°C), వెల్టూర్, పెద్దకొత్తపల్లి (38.8°C)లలో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

News March 14, 2026

అమెరికాలో వరంగల్ ఉపాధ్యాయురాలి మృతి

image

వరంగల్ నగరం దేశాయిపేట రోడ్డు రామనాథపురి కాలనీకి చెందిన చిదురాల విజయరాణి(55) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందారు. ఆమె పైడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తన చిన్న కుమార్తె పూజ ప్రసవం కావడంతో, మనవడిని చూసేందుకు ఆమె అమెరికా వెళ్లారు. రెండు రోజుల క్రితం హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడి ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు.

News March 14, 2026

భీమిలి: ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య

image

భీమిలి పరిధి కాపుల ఉప్పాడలో ఉంటున్న అప్పలరాజు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో అప్పలరాజు తీవ్రంగా గాయపడడంతో గీతం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇక్కడి నుంచి కేజీహెచ్‌కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు భీమిలి పోలీసులు తెలిపారు.