News May 7, 2025

రైతు ఉత్పత్తి సంఘాలతో ఉపాధి కల్పన: గండ్ర

image

అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025, రైతు ఉత్పత్తి సంఘాల అభివృద్ధి అనే అంశాలపై కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు ద్వారా గ్రామీణ మహిళలకు, యువతకు ఉపాధి కల్పన అలాగే సన్న, చిన్నకారు రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఎంతో దోహదపడతాయని అన్నారు.

Similar News

News March 13, 2026

NZB: ‘జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి’

image

రాజీ మార్గమే రాజ మార్గమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో చిన్న చిన్న కేసులు, మైనర్ క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ చలాన్, సివిల్ వివాదాలు సులభంగా పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News March 13, 2026

మాజీ DGP HJ దొర కన్నుమూత

image

ఉమ్మడి ఏపీ డీజీపీ HJ దొర కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. 1943లో శ్రీకాకుళంలో జన్మించిన దొర.. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేశారు. 1965 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి. కేంద్రంలో విజిలెన్స్‌ అధికారిగా, CISFకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌‌గా పనిచేశారు. పదవిలో ఉండగా.. ఆయన్ని చంపేస్తామని మావోయిస్టులు అప్పట్లో బెదిరించారు.

News March 13, 2026

UPDATE: ప్రమాద బస్సులో రామ చిలుకలు.. కొన్ని మృతి..!

image

ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ శివారులో బస్సు బోల్తా పడి నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బస్సులో అధికారులు రామచిలుకల పెట్టెను గమనించి బయటకు తీశారు. పెట్టెలో సుమారు 60 రామచిలుకలను కుక్కి ఉంచడంతో ఊపిరాడక 8 మృతి చెందాయి. దీంతో మిగిలిన చిలుకలను బయటకు తీసి వాటిని నీళ్లు తాగించి అనంతరం సమీప అటవీప్రాంతంలో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ కొన్ని చిలుకలను పశువైద్యశాలకు తరలించారు.