News May 7, 2025

నిర్మల్‌ జిల్లాలో ముగిసిన సార్వత్రిక పరీక్షలు: డీఈవో

image

నిర్మల్ జిల్లాలో పదో తరగతి, ఇంటర్ సార్వత్రిక పరీక్షలు శుక్రవారం ముగిశాయని జిల్లా విద్యాధికారి రామారావు తెలిపారు. ఈ ప్రధాన పరీక్షలు ఈ నెల20 నుంచి 25వ తేదీ వరకు జరిగాయని తెలిపారు. శనివారం ఓకేషనల్ పరీక్ష మాత్రమే జరుగుతుందని ఆయన తెలిపారు. సార్వత్రిక పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News March 18, 2026

విద్యార్థుల పఠన సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

విద్యార్థుల పఠన సామర్థ్యం మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. బుధవారం టేకులపల్లి మండలంలో ఆయన ఆకస్మిక పర్యటన నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల తీరును, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలను తనిఖీ చేశారు.

News March 18, 2026

HYD: రూల్స్ జాన్తా నై.. ఎగ్జామ్ హాల్లోకి ఫోన్లు..!

image

పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకెళ్లడం నిషేధం. కానీ పదో తరగతి పరీక్షల నిర్వహణలో HYD, పెద్దపల్లి జిల్లాల్లోని 12% కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు బయోమెట్రిక్ హాజరు తర్వాత కూడా ఫోన్లను తమవద్దే ఉంచుకుంటున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. కొన్నిచోట్ల వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం బయటకు వెళ్తోందన్న ఆరోపణలపై ఇప్పటికే అంతర్గత విచారణ నడుస్తోంది. కాగా, ఇది వ్యవస్థాగతమైన భద్రతా వైఫల్యంగా అర్థమవుతోంది.