News May 7, 2025
NRPT: దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్

భూభారతి దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ శిక్త పట్నాయక్ శుక్రవారం రోజు మద్దూరు మండల పరిధిలోని దంగల్పూర్, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అధికారులకు సూచించారు. రైతులు ఇచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలియజేశారు. ఎటువంటి భూ సమస్య అయినా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మద్దూర్ తహశీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 5, 2026
ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 10,742 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 10,305 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
News March 5, 2026
MDK: మహాత్ముడి విగ్రహాలకు అవమానం!

ఇటీవల మహాత్ముడి విగ్రహాలను అవమాన పరిచే సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం రాత్రి మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద గాంధీ విగ్రహానికి పేడ పూయడంతో పాటు కన్ను ధ్వంసం చేశారు. అలాగే తూఫ్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని తాతపాపాన్ పల్లీలో గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గతంలో మిరుదొడ్డి మండలంలోని ఓ గ్రామంలో కూడా గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. దుండగులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
News March 5, 2026
ప్రజాపాలన ప్రణాళికను అమలు చేయాలి: కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో 99 రోజుల ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేయాలని కలెక్టర్ హరిత ఆదేశించారు. గురువారం అధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 10 ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. పారిశుద్ధ్యం, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, రైతు మరియు మహిళా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


